ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన శబరీష్
MHBD: జిల్లా నూతన ఎస్పీగా డాక్టర్ శబరీష్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ములుగు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు మహబూబాబాద్ ఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ములుగు ఎస్పీగా బదిలీపై వెళుతున్న ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ నూతన ఎస్పీ శబరిష్‌కు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు.