మార్పు డెస్క్‌ను సందర్శించిన Dy.DMHO
KMR: బాన్సువాడలోని ప్రాంతీయ ఆసుపత్రిలోని మార్పు డెస్క్‌ను ఇవాళ డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.రోహిత్ సందర్శించారు. ఈ మేరకు డివిజన్ పరిధిలోని గర్భిణులకు మార్పు డెస్క్ ద్వారా అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి ఆరా తీశారు. అనంతరం వ్యాక్సినేషన్ సెంటర్‌ను సందర్శించి కోల్డ్ చైన్ సిస్టం పాటిస్తున్నారా లేదా అని ప్రశ్నించారు.