VIDEO: అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులు
ప్రకాశం: అకాల వర్షాలు మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టాలు మిగిల్చాయి. అర్ధవీడు మండలం నాగులవరం గ్రామ సమీపంలో 50 ఎకరాల మొక్కజొన్న వెయ్యగా అందులో దాదాపు 30 ఎకరాలు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. గత రెండు రోజులుగా బలమైన ఈదురు గాలులు వర్షాల కారణంగా, తీరా పంట చేతికి వచ్చే సమయానికి మొక్కజొన్న వేసిన పంట పొలాలు ధ్వంసమయ్యాయన్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.