డీఆర్‌వోగా పదవీ బాధ్యతలు చేపట్టిన
SKLM: జిల్లా రెవెన్యూ అధికారిగా వి. విశ్వే శ్వరావు బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఏలూరు జిల్లా డీఆర్‌వోగా పని చేస్తూ బదిలీ పై శ్రీకాకుళం వచ్చారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన గతంలో వివిధ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు.