రేపు 'ప్రజా పాలన' మండల స్థాయి సమావేశం

రేపు 'ప్రజా పాలన' మండల స్థాయి సమావేశం

MBNR: గండీడ్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం మండల స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. 99 రోజుల 'ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక'లో భాగంగా జరిగే ఈ సభలో ప్రభుత్వ పథకాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశానికి మండలంలోని గ్రామాల ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన కోరారు.