బస్సు కండెక్టర్‌పై మాజీ ఎమ్మెల్యే దాడి..!

బస్సు కండెక్టర్‌పై మాజీ ఎమ్మెల్యే దాడి..!

అన్నమయ్య: మదనపల్లె మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా తనపై విచక్షణారహితంగా దాడి చేశారని ఓ ప్రైవేట్ బస్సు కండెక్టర్ ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం మదనపల్లెలోని బెంగళూరు బస్టాండులో తన బస్సు కంటే ముందు ప్రయాణికులను ఎక్కిస్తావా..? అంటూ 20మంది అనుచరులతో కలిసి దాడి చేశారని కండెక్టర్ హరినాథ్ వాపోయారు. స్థానికులు బాధితుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.