హైవేపై అడ్డదిడ్డంగా లారీల పార్కింగ్
E.G: దేవరపల్లి(M) దుద్దుకూరు నేషనల్ హైవేపై లారీలు అడ్డదిడ్డంగా, నియమ నిబంధనలు పాటించకుండా పార్కింగ్ చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్లు వాహనాలను నిర్లక్ష్యంగా నిలిపివేయడం వల్ల తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వాపోతున్నారు. రాత్రి వేళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని వాహనదారులు చెబుతున్నారు.హైవే అథారిటీ పరిష్కరించాలని కోరుతున్నారు.