ఆటోలో భారీ అక్రమ మద్యం స్వాధీనం

ఆటోలో భారీ అక్రమ మద్యం స్వాధీనం

KRNL: ఆదోని పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని సిరుగుప్ప చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం ఆటోలో తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.50 వేల విలువైన 14 బాక్సుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.