VIDEO: జిల్లాలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు
VSP: జిల్లా వ్యాప్తంగా సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 133 కేంద్రాల్లో ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. 456 పాఠశాలలకు చెందిన 28,983 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. విద్యార్థులను ఉదయం 9 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షల నిర్వహణకు 1,634 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లు డీఈవో ప్రేమ్‌కుమార్ తెలిపారు.