గాంధీ జిల్లాలో పర్యటించింది ఈరోజే..!
BPT: 1921లో గాంధీజీ మన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. మార్చి 31& ఏప్రిల్ 1న విజయవాడలో అల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో పాల్గొని అనంతరం జిల్లాకు విచ్చేశారు. ఈ క్రమంలో ఆయనకు ప్రజలు భారీ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిలక్ స్వరాజ్య ఫండ్‌కి విరాళాలు సేకరించారు. జిల్లాలో స్వాతంత్ర ఉద్యమం బలపడటానికి ఈ పర్యటన కీలకంగా మారింది.