సహజీవన భాగస్వామిని హత్య చేసిన మహిళ?
VSP: ఆనందపురం శివారులో పందుల పాక సమీపంలో నాగశివ (38) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. శరీరంపై గాయాలు కనిపించడంతో పోలీసులు హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. నాగశివ, ముబీనా అలియాస్ శ్రావణి (41)తో సహజీవనం చేస్తుండగా, మద్యం మత్తులో జరిగిన గొడవలో ఆమె దాడి చేయడంతో మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనపై విచారణ కొనసాగుతోంది.