యడ్లపాడులో బైక్ దొంగ అరెస్ట్.!
PLD: యడ్లపాడు మండలంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఎస్సై శివరామకృష్ణ అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ. 3 లక్షల విలువైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందుతుడు పాములపాడు గ్రామానికి చెందిన సాగర్ బాబు (33)గా గుర్తించారు. తనిఖీల్లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలు ఒప్పుకున్నాడని డీఎస్పీ జయకృష్ణ తెలిపారు.