'చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా'
TG: ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కులానికి ఒక చెప్పు చొప్పున మెడలో వేసుకుని రాజీనామా చేస్తానని ఓ సర్పంచ్ అభ్యర్థి బాండ్ రాసివ్వడం చర్చనీయంగా మారింది. కరీంనగర్(D) చెంజర్లలో రాజేశ్వరి అనే మహిళ ఎన్నికల బరిలో నిలిచారు. తనను గెలిపిస్తే 12 పడకల ఆస్పత్రి, మినీ ఫంక్షన్ హాల్, ఓపెన్ జిమ్‌తోపాటు కోతుల సమస్య పరిష్కరిస్తానని బాండు రాసిచ్చారు. 3 ఏళ్లలో చేయకపోతే రాజీనామా చేస్తానన్నారు.