బాధ్యతలు స్వీకరించిన వైద్యాధికారులు

బాధ్యతలు స్వీకరించిన వైద్యాధికారులు

VZM: వేపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారులు వేణు, సంజన శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం కొత్తగా నిర్వహించిన రిక్రూట్మెంట్‌లో పోస్టులు సాధించిన వీరిద్దరూ వేపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులుగా నియమితులయ్యారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందిస్తామని ఆరోగ్య సిబ్బంది సహకారం అందించాలని వారు కోరారు.