మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏసీబీ తనిఖీలు
NZB: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ACB అధికారులు దాడులు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవాళ తనిఖీలు చేపట్టారు. ఉదయం వివిధ విభాగాలలో తమ పనుల నిమిత్తం జనాలతో హడావిడిగా ఉన్న సమయంలో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు దీంతో ఏం జరిగిందోనని అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.