'ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి'
KDP: సిద్ధవటం మండలంలోని కడప- బద్వేల్ ప్రధాన రహదారి ఫారెస్ట్ తనిఖీ కేంద్రం వద్ద సోమవారం సాయంత్రం ఎస్సై హారిక విస్తృతంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్, లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలన్నారు. సరైన పత్రాలు లేని 10 ద్విచక్ర వాహనదారులకు ఒక్కో వాహనానికి రూ. 185 చొప్పున అపరాధ రుసుము విధించామని తెలిపారు.