రోడ్డు ప్రమాదం.. యువకుడికి తీవ్ర గాయాలు
కృష్ణా: ఇబ్రహీంపట్నం మండలంలోని కాచవరం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి యువకుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.