'పిల్లలకు తెలుగు భాషపై పట్టు అవసరం'
Vsp: పిల్లలకు తెలుగు భాషపై పట్టు, జాతి మూలాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని హైకోర్టు న్యాయమూర్తి గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ అన్నారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ 22వ వార్షికోత్సవం సందర్భంగా విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవ చేసిన ప్రముఖులను సత్కరించారు.