ఉగ్రదాడికి నిరసనగా పాకి వలస గ్రామస్తులు ర్యాలీ

ఉగ్రదాడికి నిరసనగా పాకి వలస గ్రామస్తులు ర్యాలీ

SKLM: జమ్మూకశ్మీర్‌లోని ఫహల్గామ్‌ ప్రాంతంలో ఇటీవల జరిగిన భయానక ఉగ్రదాడి దారుణమని కోటబొమ్మాలి మండలం పాకివలస గ్రామస్థులు అన్నారు. శనివారం గ్రామస్థులంతా గ్రామ వీధుల్లో శాంతియుతంగా కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పహల్గామ్‌ ఉగ్రదాడిలో మరిణించిన వారికి సంతాపం తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీయడం అనేది పిరికిపంద చర్య అని అన్నారు.