జన్మదిన సందర్భంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరం

SKLM: భారతీయ జనతా పార్టీ నరసన్నపేట నియోజకవర్గ ఇంఛార్జ్ గొద్దు భాగ్యలక్ష్మి జన్మదిన సందర్భంగా జిబిఎల్ ఫౌండేషన్ వారి సౌజన్యంతో గురువారం శ్రీకాకుళం పట్టణంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని విజయశ్రీ బ్లడ్ సెంటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు. భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. రక్తదానం చేయండి ఇంకొకరు ప్రాణం నిలబెట్టండన్నారు.