నేటి నుంచి నూతన చట్టాలు అమలు: ఎస్పీ

JGTL: నేటి నుంచి నూతన చట్టాలు అమలులోకి వస్తాయని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నూతన న్యాయ, నేర చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. దేశ అంతర్గత భద్రతలో కొత్త చట్టాలు నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.