'రూ. 50 వేలకు మించి డబ్బు తరలిస్తే చర్యలు'

'రూ. 50 వేలకు  మించి డబ్బు తరలిస్తే చర్యలు'

MDK: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో రూ. 50 వేలకు మించి డబ్బు తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా వస్తువులు, మద్యం, డబ్బు తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.