మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఛైర్మన్
HNK: కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఈరోజు ఇందిరమ్మ చీరలు పంపిణీ జరిగింది. హుజూరాబాద్ ఇన్‌ఛార్జి ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఝాన్సీ రాణి స్వయం సహాయక సంఘ సభ్యులకు చీరలు అందజేశారు. మండలంలో 17,600 మందికి నాణ్యమైన చీరలు ఇస్తున్నామని, గత ప్రభుత్వంలో చీరలు పొలాల్లో పిట్టలు తరిమేందుకు మాత్రమే పనికొచ్చేవని ఎద్దేవా చేశారు.