ఎడ్లంక దీవి గ్రామం పరిస్థితి పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక దీవి గ్రామం వద్ధ కృష్ణానది వరదను శుక్రవారం ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. దీవిలో నది అంచు వెంబడి గృహాల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వీఆర్ఏ నివసించే ఇల్లు నదిలోకి కూలిపోయేందుకు సిద్ధంగా ఉందని తహసీల్దార్ నాగమల్లేశ్వరరావు తెలిపారు. నది కోత బాధితులకు ఇళ్ల స్థలాలు, ఇళ్ళు కేటాయించాలని ఆదేశించారు.