అయ్యప్పస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు

SKLM: సారవకోట మండలం కోదడ్డ పనస గ్రామంలో స్వయంభు వెలసిన శ్రీ అయ్యప్పస్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులకు గోత్రనామాలతో పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చర్యలు చేపడుతున్నారు.