VIDEO: విద్యార్థినిపై దారుణం.. పోక్సో కేసు నమోదు
HNK: హసన్‌పర్తి మండలంలోని ఓ కళాశాలలో విద్యార్థినిపై జరిగిన ఘటన సంచలనం రేపింది. జూనియర్ విద్యార్థినిని సీనియర్ విద్యార్థి మోసం చేసి స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి అవమానకరంగా వీడియో చిత్రీకరించినట్లు సమాచారం. ఆవీడియోను వాట్సాప్ గ్రూపులో షేర్ చేయడంతో విషయం బయటపడింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆదివారం పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.