శింగనమలలో రేపు స్త్రీ శక్తి విజయోత్సవ సభ

శింగనమలలో రేపు స్త్రీ శక్తి విజయోత్సవ సభ

ATP: శింగనమల నియోజకవర్గంలో రేపు ఆదివారం ఉదయం 9 గంటలకు పరిషత్ హై స్కూల్ గ్రౌండ్‌లో "స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభ" జరగనుంది. ఈ సభకు ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ హాజరవుతారని టీడీపీ మండల కన్వీనర్ గుత్తా ఆదినారాయణ తెలిపారు. శనివారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు.