రోడ్డు ప్రమాదం: ముగ్గురికి గాయాలు

రోడ్డు ప్రమాదం: ముగ్గురికి గాయాలు

ASR: డుంబ్రిగుడ మండలంలో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. డుంబ్రిగుడ నుంచి బళ్ళుగూడ వైపు ప్రయాణిస్తున్న ఆటో, ఏకలవ్య పాఠశాల సమీపంలో శునకం దారిలోకి రావడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో ఆటో రెండు పల్టీలు కొట్టి రోడ్డుపై బోల్తాపడింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.