మహిళ మృతితో హాస్పిటల్ ఎదుట ఆందోళన
హన్మకొండలోని ఓ హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఆత్మకూరు గ్రామానికి చెందిన బాలమణి అనే మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మృతురాలి కుమారుడు శ్రీకాంత్ మాట్లాడుతూ.. సర్జరీ తర్వాత ఐసీయూలో ఉంచకుండా జనరల్ వార్డులో ఉంచడమే తమ తల్లి మృతికి కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.