4,032 కిలోల కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
TG: రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో కల్తీ అల్లం పేస్టు వ్యవహారం బయటపడింది. కాటేదాన్ పారిశ్రామికవాడలో SKR ఫుడ్ ప్రొడక్ట్స్‌పై పోలీసులు దాడి చేసి హసన్ అలీని అరెస్టు చేశారు. రూ.22 లక్షల విలువైన 4,032 కిలోల అల్లం, వెల్లుల్లి పేస్టును స్వాధీనం చేసుకున్నారు. నాణ్యత లేని 6వేల కిలోల వెల్లుల్లి, 210 కిలోల అల్లం వెల్లుల్లి పొట్టు స్వాధీనం చేసుకున్నారు.