వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా సంక్షేమ అధికారి

KMR: రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలోగల బుగ్గ రామలింగేశ్వర టెంపుల్ వద్ద గల వృద్ధాశ్రమాన్ని జిల్లా సంక్షేమ అధికారి ఏ. ప్రమీల సందర్శించడం జరిగింది. అక్కడ వారికి ఉన్న సౌకర్యాలు వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. భిక్నూర్‌లోని మహిళా సాధికారత కేంద్రం వారు ఏర్పాటు చేసిన నిరుద్యోగ యువతలకు మగ్గం శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.