'ప్రభుత్వం కాపులను చిన్నచూపు చూస్తోంది'

GNTR: కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కాపులు కీలక పాత్ర పోషించినప్పటికీ, అధికారంలోకి వచ్చాక తమను చిన్నచూపు చూస్తున్నారనే అభిప్రాయం వారిలో ఉందని జనసేన నాయకుడు చందు సాంబశివరావు పేర్కొన్నారు. ఆదివారం కాపు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు తిరుమలశెట్టి కొండలరావు ఆధ్వర్యంలో మంగళగిరిలో జరిగిన ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.