తాళం వేసిన ఇంట్లో చోరీ

తాళం వేసిన ఇంట్లో చోరీ

కోనసీమ: జిల్లాలోని అమలాపురం గ్రామీణ ప్రాంతమైన సమనస పంచాయతీ రంగాపురంలో గురువారం ఉదయం ఓ ఇంట్లో చోరీ జరిగింది. నాగరాజు వీవీ సత్యనారాయణరాజు పదిరోజుల క్రితం కుటుంబంతో కలిసి ఊరు వెళ్లారు. దొంగలు అదే అదునుగా చేసుకొని నగదు, బంగారు అభరణాలను అపహరించినట్లు సమాచారం. పోలీస్ డాగ్ స్క్వాడ్, క్లూ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.