సుల్తాన్‌పూర్‌కు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు

SRD: చౌటకూర్ మండలం సుల్తాన్‌పూర్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ డాక్టర్ క్రిస్టినా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి 2.60 కోట్ల నిధులను కూడా మంజూరు చేశారు.