రేపు బాసర అమ్మవారి ఆలయం మూసివేత

NRML: ఆదివారం చంద్రగ్రహణం కారణంగా బాసర అమ్మవారి ఆలయాన్ని ద్వారబంధనం చేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మహానివేదన, హారతి అనంతరం ప్రధాన ఆలయంతో పాటు ఉప ఆలయాలను కూడా ద్వారబంధనం చేయనున్నారు. తిరిగి సోమవారం వేకువజామున 4 గం.లకు అన్ని ఆలయాల ద్వారాలు తెరిచి గ్రహణ సంప్రోక్షణ అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి యధావిధిగా అన్ని సేవలు కొనసాగుతాయన్నారు.