పొన్నూరులో ఘనంగా గణేష్ ఉత్సవాలు

GNTR: పొన్నూరు మండల పరిధిలో బుధవారం వినాయక చవితి పండుగ ఘనంగా ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహక కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.