VIDEO: వృద్ధుడి ధైర్యానికి పరుగులు తీసిన చీతా

VIDEO: వృద్ధుడి ధైర్యానికి పరుగులు తీసిన చీతా

మధ్యప్రదేశ్ మోరెనా జిల్లాలో ఓ వృద్ధ రైతు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించాడు. కునో అభయారణ్యం నుంచి తప్పించుకుని తన పశువులపై దాడికి యత్నించిన చీతాను చూసి ఆయన వెనకడుగు వేయలేదు. చేతిలోని కర్రతోనే ఆ క్రూర మృగాన్ని ఎదిరించి అక్కడి నుంచి తరిమికొట్టాడు. ప్రాణాలకు తెగించి తన గేదెలను కాపాడుకున్న ఆ వృద్ధుడి సాహసాన్ని చూసి అటవీ అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు.