చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించిన విప్

చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించిన విప్

MHBD: హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్‌లో డోర్నకల్ మండలం జోగ్యతండ గ్రామానికి చెందిన వరుణ్ తేజ్, నిత్యశ్రీ చికిత్స పొందుతుండగా నేడు ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్యులతో ఆయన చర్చించారు. పిల్లలకు మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు.