టిడ్కో గృహాల పనులపై సమీక్ష..!
కడప: నగరంలోని సరోజినీ నగర్ టిడ్కో గృహాలను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి అధికారులతో కలిసి పరిశీలించారు. పెండింగ్లో ఉన్న విద్యుత్, డ్రైనేజీ, తాగునీటి పనులను వేగవంతం చేసి గృహాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. లబ్ధిదారులకు త్వరగా ఇళ్లను అందజేయాలని సూచించారు.