VIDEO: ప్రత్యేక ఆకర్షణగా ఖానాపూర్ ఎమ్మెల్యే
ADB: తెలంగాణ శాసనసభ్యుల సాంస్కృతిక వేడుకల్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒకవైపు ప్రజా సమస్యల పరిష్కారంలో నిత్యం బిజీగా ఉండే ఆయన, ఈ సాంస్కృతిక కార్యక్రమంలో తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించారు. అదిరిపోయే స్టెప్పులతో హుషారైన నృత్యం చేసి సభికులను మంత్రముగ్ధులను చేశారు. ఈ వేడుకల్లో పలువురు ఎమ్మెల్యేలు ప్రదర్శనలు, నృత్యం చేస్తూ అలరించారు.