మాజీ సీఎం జగన్‌ను కలిసిన గోరంట్ల మాధవ్
సత్యసాయి: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మంగళవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిద్దరూ కొద్దిసేపు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంబంధిత అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.