VIDEO: అమాయక పేద పోడు రైతులకు అన్యాయం చేయవద్దు: RSP
ASF: సిర్పూర్ (టి) మండలం ఆరెగూడ, పెద్దబండ గ్రామాల రైతుల పోడు భూముల సమస్యపై BRS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆదివారం ఫోన్‌లో అటవీ అధికారులతో చర్చలు జరిపారు. అమాయక పేద రైతులకు అన్యాయం చేయవద్దని, వారికి త్వరగా న్యాయం చేయాలని కోరారు. రైతులపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తాను పూర్తి బాధ్యత వహిస్తానని అధికారులకు స్పష్టం చేశారు.