ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తా: నూతన సర్పంచ్

ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తా: నూతన సర్పంచ్

BHPL: రేగొండ మండలం పోచంపల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కేసిరెడ్డి సబితా-ప్రతాప్ రెడ్డి అధిక మెజారిటీతో నూతన సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సబితా మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి అధిక మెజారిటీతో గెలిపించిన గ్రామ ప్రజలకు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.