సాంగ్వి లో బోనమెత్తిన మహిళలు

సాంగ్వి లో బోనమెత్తిన మహిళలు

NRML: దిలావర్ పూర్ మండలం సాంగ్వి లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసం ఆదివారం కావడంతో గ్రామంలోని మహిళలంతా బోనమెత్తుకుని గ్రామం లో ప్రధాన వీధుల గుండా శోభ యాత్ర నిర్వహించారు . శివ సత్తుల నాటట్యం, పోతారాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. గ్రామస్థులంతా కలిసి గ్రామ దేవతలకు నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.