ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో జిల్లాకు 21వ ర్యాంక్
మంచిర్యాల జిల్లా 60.31% ఉత్తీర్ణతతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో రాష్ట్రంలో 21వ ర్యాంకు పొందింది. మొత్తం 5,372 మంది పరీక్షలకు హాజరుకాగా 3,240 మంది పాస్ అయ్యారు. బాలురు 2,424 మంది పరీక్ష రాయగా 1,181 మంది (48.72%), బాలికలు 2,948 కి గాను 2,059 మంది (69.84%) ఉత్తీర్ణత సాధించారు. ఒకేషన్ కోర్స్‌లో 57.55 శాతం ఉత్తీర్ణతతో స్టేట్‌లో 23వ స్థానంలో నిలిచింది.