మరో దఫా జిల్లాకు చేరిన ఎరువులు

KMM: జిల్లా రైతుల అవసరాల కోసం మరో దఫా ఎరువులు చేరుకున్నాయి. చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కి చేరగా, మార్కెఫెడ్, డిస్ట్రిబ్యూటర్లకు కేటాయించారు. ఈ విడతలో 964.80 మెట్రిక్ టన్నుల యూరియా, 127.60 మె.టన్నుల డీఏపీ, 446.60 మె.టన్నుల 20.20.0.13, 63 మెట్రిక్ టన్నుల 10.26.26, 63.80 మెట్రిక్ టన్నుల జీఎస్ఎస్పీ చేరిందని ఆయన తెలిపారు.