VIDEO: కుక్కకు తులాభారం: క్షమాపణలు చెప్పిన నటి
MLG: మేడారం జాతరలో తన పెంపుడు కుక్కకు తులాభారం వేసిన ఘటనపై టాలీవుడ్ నటి టీనా శ్రావ్య బహిరంగంగా బుధవారం క్షమాపణలు తెలిపారు. కుక్క అనారోగ్యం నుంచి కోలుకోవాలని మొక్కుకున్న భక్తితోనే అలా చేశానని ఆమె స్పష్టం చేశారు. గిరిజన సంప్రదాయాలు, భక్తుల మనోభావాలను కించపరిచే ఉద్దేశం తనకు లేదని, ఎవరికైనా అభ్యంతరం కలిగితే క్షమించాలని ఆమె కోరారు.