నిరాశ్రయుల ఆశ్రమాన్ని సందర్శించిన కలెక్టర్

నిరాశ్రయుల ఆశ్రమాన్ని సందర్శించిన కలెక్టర్

W.G: భీమవరం వీరమ్మ పార్కు రోడ్డులో ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఆశ్రమంలో నివసిస్తున్న నిరాశ్రయులతో మాట్లాడి వారి అవసరాలు, సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆధారం లేని నిరాశ్రయులకు ఈ వసతి గృహం ఒక దేవాలయంలాంటిదని పేర్కొన్నారు.