సైబర్ వల.. చిక్కితే విలవిల

సైబర్ వల.. చిక్కితే విలవిల

NZB: ఉమ్మడి జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కేవలం ఆరు నెలల్లోనే జిల్లా వ్యాప్తంగా బాధితులు సుమారు రూ. 4 కోట్లకు పైగా సొమ్మును పోగొట్టుకున్నారు. గతంతో పోలిస్తే ఈ జిల్లాలో నేరాల సంఖ్య 30 శాతం పెరగడం గమనార్హం. ముఖ్యంగా ఆర్మూర్, బోధన్, కామారెడ్డి ప్రాంతాల్లో గల్ఫ్ బాధితులే లక్ష్యంగా ఫేక్ లాటరీ కాల్స్, ద్వారా డబ్బులు కొల్లగొడుతున్నారు.