వాల్మీకి విగ్రహావిష్కరణలో పాల్గొన్న ఎమ్మెల్యేలు

ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి బుక్కరాయసముద్రం మండలంలో పర్యటించారు. కెకె అగ్రహారం గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుతో కలిసి ఆమె పాల్గొన్నారు. అనంతరం వాల్మీకి విగ్రహావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి బోధనలు మానవాళికి ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.